పోరాడుతూ చనిపోవాలంతే!

Monday, December 23, 2024

పోరాడుతూ చనిపోవాలంతే! తల్లి ఆశీర్వాదం బిడ్డకు ఎప్పుడూ తోడుంటుందంటారు. కానీ నా బిడ్డ విషయంలో మాత్రం అది శాపంగా మారింది అంటోంది ఓ తల్లి. మరి ఆమె ఆశీర్వాదం తన బిడ్డకు ఎందుకు శాపంగా మారిందో తెలుసుకోవాలంటే గాంధారి సినిమా చూడాల్సిందే.

బాలీవుడ్‌ కథానాయిక తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. దేవాశిశ్‌ మఖిజా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ మొదలైనట్లు తెలుపుతూ..సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోల్ని పంచుకుంది తాప్సీ. టైమ్‌ వచ్చినప్పుడు యుద్దరంగంలో వీరోచితంగా పోరాడుతూ మరణించాలి, కానీ ఎప్పుడూ శత్రువుల ముందు భయం ప్రదర్శించొద్దు.

ఇప్పుడు పోరాటం ప్రారంభిద్దాం..అని వ్యాఖ్యల్ని జోడించింది. ఇందులో ప్రతీకారం తీర్చుకునే ఓ శక్తివంతమైన తల్లిగా కనిపించనుందామె. ఈ చిత్రాన్ని కనికా థిల్లాన్‌ నిర్మిస్తోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles