ఆ విషయం లో మేమిద్దరం ఒక్కట

Sunday, December 22, 2024

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముందు సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌ చేసి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరో అయిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై బేబి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

బేబీ సినిమాలో ఆనంద్ నటనను ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు.తాజాగా ఆనంద్ దేవరకొండ “గం గం గణేశా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా చేశారు.ఈ సినిమా ఈ నెల 31 న గ్రాండ్ గా విడుదల కానుంది.   క్రైమ్ కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన గొంతు ,ఆనంద్ గొంతు ఒకేలా ఉంటుంది. దీనితో మేమిద్దరం మా ఫ్రెండ్స్ ని సరదాగా ఆటపట్టించేవాళ్లమని రౌడీ హీరో చెప్పుకొచ్చాడు. అలాగే ఇంట్లో మా అమ్మ ని పిలిచినప్పుడు మా ఇద్దరిలో ఎవరు పిలుస్తున్నారో తాను అస్సలు గుర్తు పట్టలేదు. అలా మా ఇద్దరి వాయిస్ విషయంలో అందరు తికమక పడతారని  విజయ్ తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles