యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా సినిమా ఆంధ్ర కింగ్పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ కొత్త లుక్‌తో కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్స్ చూసినప్పటినుంచే ఫ్యాన్స్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తోంది. రామ్ – భాగ్యశ్రీ జోడీ స్క్రీన్‌పై ఎలా కనిపిస్తుందా అనే కుతూహలం ఇప్పుడు ప్రేక్షకుల్లో పెరిగింది.
ఇక మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. నవంబర్ 28న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ సరైనదేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సాధారణంగా నవంబర్‌లో ఎక్కువ సినిమాలు పెద్దగా రాణించకపోవడం తెలిసిందే.
సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా క్రేజీ సినిమాలు క్యూలో ఉండటంతో, ఆ పోటీని తప్పించుకోవడానికే రామ్ టీమ్ నవంబర్ రిలీజ్‌కి వెళ్ళినట్టు సమాచారం.
