హైదరాబాద్‌ లో వార్‌!

Tuesday, December 31, 2024

బాలీవుడ్‌ లో ఎంతో గ్రాండ్‌ గా తెరకెక్కిన వార్ సినిమా 2019లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘వార్-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మూవీ మేకర్స్‌. ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌గా స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్, జూ.ఎన్టీఆర్ ఈ మూవీలో యాక్ట్‌ చేస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ హైద‌రాబాద్ లో జ‌ర‌గబోతుంది. దీని కోసం భారీ బ‌డ్జెట్ తో ఓ సెట్ కూడా ఇప్పటికే రెడీ చేస్తున్నారంట‌. ఆగ‌స్టులో ప్రారంభం కానున్న‌ ఈ షెడ్యూల్ లో హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ ల మ‌ధ్య ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుందంట.

ఈ ఫైట్ సీక్వెన్స్ ఇంట‌ర్వెల్ లో రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే హైలైట్ గా ఉండ‌నుందని చిత్ర బృందం పేర్కొంటుంది. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ సినిమాను 2025 ఆగ‌స్టు 14న విడుదల చేసేందుకు మూవీ మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles