కూలీని మించిన వార్‌ 2..!

Friday, December 5, 2025

ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పైకి రావాల్సిన పాన్ ఇండియా చిత్రాల్లో ఎలాంటి భారీ హైప్ ఉందంటే, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2, అలాగే రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలు టాప్‌లో ఉంటాయి. ఈ రెండూ కూడా మాస్ ఆడియెన్స్‌కి కావాల్సినంత యాక్షన్, స్టైల్, ఎమోషన్‌తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఒకవైపు ఎన్టీఆర్ – హృతిక్ కలయిక అనే కాంబినేషన్ పక్కా పాన్ ఇండియా అట్రాక్షన్ అయితే, మరోవైపు రజినీకాంత్ మళ్లీ మాస్ గెటప్‌లో ఎంటర్‌టైన్ చేయనున్న కూలీ కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే ఈ రెండు సినిమాల అభిమానులు వేర్వేరు వర్గాలుగా విడిపోయి తమ తమ సినిమాకే మద్దతు ఇస్తున్నారు.

అయితే తాజాగా బుక్ మై షోలో రెండు సినిమాలపై యూజర్ల ఇంట్రెస్ట్ డేటా చూస్తే, వార్ 2 మరింత ముందున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. కూలీ సినిమాకు దాదాపు 2 లక్షల మంది “ఇంట్రెస్టెడ్” అని ఫాలో అవుతుండగా, వార్ 2 కి మాత్రం 3.5 లక్షల మందికి పైగా ఆసక్తి చూపించడం జరిగింది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచ్యువల్ హైప్ ఉన్నా, వర్చువల్‌గా మాత్రం వార్ 2కి క్లియర్ అడ్వాంటేజ్ ఉన్నట్టు చెబుతుంది.

ఈ రెండూ ఆగస్ట్ 14న థియేటర్లకు రానున్న నేపథ్యంలో ఏ సినిమా ప్రేక్షకుల మన్ననలు గెలుచుకుంటుందో, వాస్తవ విజేత ఎవరన్నది త్వరలో తేలనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles