తారక్‌ కే ఎక్కువ!

Monday, December 8, 2025

బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క సినిమాపైనే ఉంది. అదే వార్-2. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అభిమానులు కూడా ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పుడు సినిమా గురించి ఒక ఆసక్తికర సమాచారం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని, ఇందులో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ.70 కోట్ల వరకూ వెళ్లిందనే చర్చ జరుగుతోంది. ఇక హృతిక్‌కి ఇచ్చిన పారితోషికం రూ.50 కోట్ల వరకు ఉంటుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంటే సినిమాలో ప్రధాన రోల్ హృతిక్‌దే అయినా, ఎన్టీఆర్‌కు ఎక్కువ పారితోషికం దక్కిందనే మాటలు షేక్ చేస్తున్నాయి.

ఇక సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్‌లతో నిండిపోనున్నట్టు సమాచారం. ఇంటర్నేషనల్ స్టైల్‌లో షూటింగ్ జరిపిన ఈ మూవీని దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. విడుదల తేదీగా ఆగస్టు 14ని నిర్ణయించారన్న టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ స్టైల్ ఐకాన్ హృతిక్ రోషన్ కలిసి తెరపై కనిపించబోతుండటంతో ఈ సినిమా ఒక సాలిడ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలవనుంది. మరి అందరికీ నచ్చేలా ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకుల మన్ననలు పొందుతుందా అనే ఆసక్తి పెరుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles