దేవర తో సూపర్ హిట్ అందుకున్న తారక్ ప్రస్తుతం ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ వారంలో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది. దసరా హాలీడేస్ ఉండడం.. పెద్ద సినిమాలేవి థియేటర్లో లేకపోవడంతో దేవరకు ఎదురే లేదు. ఇక ఓ వైపు థియేటర్లో దేవర దండయాత్ర జరుగుతూనే ఉండగా.. మరోవైపు ఎన్టీఆర్ మరో యుద్ధానికి సిద్దం అవుతున్నాడు.
దేవర తర్వాత టైగర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ సినిమా వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ఎన్టీఆర్ కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై పలు కీలక యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించబోతున్నారు.
అయితే.. అంతకంటే ముందు ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో ఒక మాస్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ సెట్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. ఈ పాట కోసం అక్టోబర్ మూడో వారంలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో జాయిన్ కానుండంట. ఈ పాటకు వైభవి మర్చంట్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారట. ఈ మూవీ మొత్తానికి ఈ సాంగ్ హైలెట్‌గా నిలవనుందని సమాచారం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఇండియన్ హీరోల టాప్ డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే.. ఎన్టీఆర్, హృతిక్ టాప్‌లో ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి మాస్ సాంగ్ అంటే.. థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఆగష్టులో వార్2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.