వార్‌ 2 షూటింగ్‌ ప్రారంభం…10 రోజుల పాటు తారక్‌ అక్కడే!

Thursday, December 26, 2024

యంగ్‌ టైగర్‌ ఎన్టీర్‌ ప్రస్తుతం దేవర సినిమా చిత్రీకరణలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాని ఎన్టీఆర్‌ క్రేజ్‌ కు తగ్గట్లుగా పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేయాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా
ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

శుక్రవారం నుంచి ఎన్టీఆర్‌ ఈ షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ముంబైలోని యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ ఉండనున్నట్లు తెలుస్తుంది.  హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారంట.

వార్‌ 2 సినిమాలో తారక్‌ ఓ రా ఏజెంట్‌ గా నటించనున్నారు. ఈ సినిమాకి .. యే జవానీ హై దివానీ, బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో కథానాయికగా చేస్తుంది.. వచ్చే ఏడాది ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకురానున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles