వార్ 2 వాయిదా..ఎందుకంటే!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ లో హృతిక్‌ రోషన్‌ తో కలిసి వార్‌ 2 సినిమాలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం అటు తారక్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వార్‌ 2 బాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్లు క్రియేట్‌ చేస్తుందా అని అందరూ ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు.

ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇటీవల దేవర షూటింగ్‌ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వార్-2 మూవీ షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి విదేశాలకు పయనమయ్యాడు.

రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్స్‌లో ఈ షూటింగ్ జరగాల్సి ఉంది. ఇక ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles