బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ హీరో తారక్ కాంబో లో వచ్చిన “వార్ 2” సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి చాలా పెద్ద అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ మూవీ విడుదలైన తర్వాత టాక్ మాత్రం మిక్స్డ్ గా వచ్చింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదల అయిన కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్క్ ను చేరుకుంది.
ఇతర భాషల వసూళ్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, హిందీ వెర్షన్ మాత్రం బలంగా నడుస్తోంది. ముందులో భారీ ఓపెనింగ్ దక్కకపోయినా, తరువాత రోజుల్లో స్టడీగా నడుస్తోంది. వీక్ డేస్ లో కూడా సినిమా డీలా పడకుండా మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఉదాహరణకు, సోమవారం ఈ సినిమా హిందీలో ఏడున్నర కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, మంగళవారం మాత్రం ఇంకాస్త పెరిగి ఎనిమిదిన్నర కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది.
