ఆ అవార్డు కోసం వెయిటింగ్‌!

Friday, April 4, 2025

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నేషనల్ అవార్డ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేషనల్ అవార్డ్ అందుకోవాలని తనకు ఎంతో ఆశగా ఉందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. పైగా ఆ అవార్డు అందుకున్న రోజే తన నాయనమ్మ ఇచ్చిన చీర కట్టుకుంటానని కూడా సాయి పల్లవి చెప్పింది. ఈ విషయం గురించి సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘నాకు 21 ఏళ్లున్నప్పుడు మా నానమ్మ ఓ చీర ఇచ్చింది. దానిని ఏదైనా అవార్డుల ప్రదానోత్సవానికి కట్టుకోవాలని అనుకున్నా. అందుకే జాతీయ అవార్డు వస్తే దానిని ధరిస్తా’ అని తెలిపింది.

అయితే, ‘గార్గి’ మూవీకిగాను సాయిపల్లవికి జాతీయ అవార్డ్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమాకి ఆమెకు అవార్డు రాలేదు. ఏది ఏమైనా సాయి పల్లవికి అంటూ ప్రత్యేకంగా క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లుగానే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ కూడా వేసుకోదు. సహజంగా పెద్ద అవకాశాలు వస్తుంటే హీరోయిన్లు మారిపోతుంటారు. కానీ, సాయి పల్లవి మాత్రం మారలేదు. అప్పటికీ ఇప్పటికీ సాయిపల్లవి ఒకేలా ఉంది. అదే ఆమె సక్సెస్ కి కారణం అంటూ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles