వార్‌ 2 కోసం ఆ స్టార్‌ హీరోల వాయిస్ ఓవర్‌!

Monday, February 3, 2025

వార్‌ 2 కోసం ఆ స్టార్‌ హీరోల వాయిస్ ఓవర్‌! మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కాంబోలో రాబోతున్న ‘వార్ 2’ సినిమా కూడా ఒకటి. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ గా మారిపోతుంది. తాజాగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ పాత్రలను, తెలుగులో మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట.

హిందీలో రణబీర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారంట. సినిమాలో హీరోల పాత్రల గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ సినిమాలో కీలకం అని తెలుస్తోంది. సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది.దర్శకుడు అయాన్ ముఖర్జీ, కేవలం ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ ఫ్యాన్స్ కోసమే స్పెషల్ గా ఈ సినిమాను డిజైన్ చేశారట.

పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబో అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles