తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబోలో భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిజానికి ఈ సినిమా ఈ జనవరి సంక్రాంతి బరిలోనే విడుదల కావాల్సి ఉంది.
కానీ పలు కారణాలు చేత సినిమాని వాయిదా వేయగా ఇపుడు ఫైనల్ గా ఈ సినిమా విడుదల తేదీ కోసం సాలిడ్ బజ్ వినపడుతుంది. దీంతో మెగాస్టార్ కి స్పెషల్ డేట్ అయిన మే 9నే ఈ చిత్రం ఉండొచ్చని మళ్ళీ టాక్ వినపడుతుంది. మరి ఈ డేట్ లోనే చిరు మరో ఫాంటసీ వండర్ “జగదేక వీరుడు అతిలోక సుందరి” కూడా వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఈ డేట్ లోనే విశ్వంభర కూడా వస్తుంది అని ఆ మధ్య టాక్ వినపడింది. అయితే ఇపుడు మళ్ళీ ఇదే డేట్ పై బజ్ మొదలైంది. దీనితో విశ్వంభర ఈ డేట్ లోనే రావచ్చని చెప్పాలి.