బిజీబిజీ పనుల్లో విశ్వంభర!

Thursday, December 26, 2024

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర..ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటించనుంది.ఈ సినిమాని బింబిసార ఫేం వశిష్ఠ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్‌ తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఎంతో వేగంగా పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రస్టింగ్‌ అప్డేట్‌ ని మూవీ మేకర్స్‌ అభిమానులకు అందించారు. ప్రస్తుతం సినిమా మ్యూజికల్ యూనిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

చిరు సంగీత దర్శకుడు కీరవాణి సహా దర్శకుడు వశిష్ట ఇంకా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు బెంగళూరుకు ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వెళ్లినట్టుగా సమాచారం. మరి  కొన్ని రోజులు కితమే చిరు తమ ఆపద్బాంధవుడు తరహాలో సాంగ్స్ కంపోజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక విశ్వంభర మ్యూజిక్ ఆల్బమ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ భారీ సినిమాల వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కి కాబోతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles