విరూపక్ష కాంబో మరో

Sunday, December 22, 2024

మెగా కంపౌండ్‌ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా నటిస్తున్నసినిమా  ‘SDT18’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌న మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించబోతున్నారు. అజనీష్ సంగీతానికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ‘కాంతార’ వంటి చిత్రానికి సంగీతం అందించింది అజనీష్ కావడం విశేషం. ఇక ‘SDT18’ వరల్డ్‌లో అదిరిపోయే సంగీతం ఆయన ఇస్తారని మేకర్స్‌  చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఈ మేరకు ఓ గ్లింప్స్ ద్వారా అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ భారీ మేకోవర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన బీస్ట్ మోడ్‌లో కనిపిస్తాడని రీసెంట్ గ్లింప్స్ వీడియోలో తెలిపారు. అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్‌ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles