ప్రస్తుతం సౌత్ సినిమా నుంచి రాజకీయాల్లో అనేకమంది సినీ నటులు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానంగా కనిపిస్తే తన తర్వాత అదే రేంజ్ స్టార్డం ఉన్న తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కూడా పార్టీ పెట్టి తమిళనాట కీలకంగా మారారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అక్కడ మరో బిగ్ స్టార్ థలా అజిత్ కుమార్ చేసిన ఆసక్తికర కామెంట్లు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
మరి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం అజిత్ మాట్లాడుతూ ఖచ్చితంగా అది చాలా ధైర్యమైన నిర్ణయం, విజయ్ కి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు. దీనితో అజిత్ నుంచి విజయ్ పై ఈ రకమైన స్టేట్మెంట్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ లో కూడా మంచి వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గానే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా విజయ్ జన నాయగన్ సినిమాలో బిజీగా ఉన్నారు.
