ఫాదర్‌ సెంటిమెంట్‌ తో విజయ్‌ సినిమా!

Tuesday, December 9, 2025

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘రౌడీ జనార్దన్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించే పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. ప్రత్యేకంగా రెండో భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా కదిలించేలా ఉండనుందని సినీ వర్గాల సమాచారం. ఆ సీన్స్‌లో తండ్రి-కొడుకు బంధం చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయట.

గ్రామీణ నేపథ్యంతో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ జంట కొత్తగా కనిపించబోతోందనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో పెరిగింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఒకటి కాగా, మరొకటి ఈ రౌడీ జనార్దన్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles