అసలు గొడవేంటో చెప్పుకొచ్చిన విజయ్‌ సేతుపతి!

Saturday, December 21, 2024

విల‌క్ష‌ణ త‌మిళ న‌టుడు విజయ్ సేతుపతి గురించి ఏ ఇండస్ట్రీకి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. ఓ పక్క హీరోగా.. మరోపక్క నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే విజ‌య్ తాజాగా న‌టించిన చిత్రం మహారాజ. ఈ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా మూవీ చూసిన ప్రేక్ష‌కులంద‌రూ సూప‌ర్‌ గా  ఉంద‌ని కామెంట్లు  పెడుతున్నారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌య్ సేతుప‌తి త‌న‌కు విఘ్నేశ్‌ శివన్‌కు మ‌ధ్య ఉన్న వివాదం గురించి వివరణ ఇచ్చారు.

విజ‌య్ సేతుప‌తి, న‌య‌న్‌ క‌లిసి న‌టించిన చిత్రం నానుమ్ రౌడీ తాన్ (నేను రౌడీనే). ఈ సినిమాకు న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేశ్‌ శివన్ డైరెక్షన్‌ వ‌హించాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో విజ‌య్‌కు విఘ్నేశ్ కి మ‌ధ్య గొడ‌వ జరిగినట్లు తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ మొద‌టిరోజు నువ్వు నాకు యాక్టింగ్ నేర్పుతున్నావా నేను చేసేది నీకు అర్థం అవ్వడం లేదంటూ విఘ్నేశ్‌పై గ‌ట్టిగా అరిచాను. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల త‌రువాత నయన్‌ వ‌చ్చి ఇద్ద‌రికి సర్దిచెప్పింది. విక్కీ ఈ సినిమా స్క్రిప్ట్‌ నాతో చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. కానీ షూటింగ్ స‌మ‌యంలో విక్కీని అర్థంచేసుకోలేక పోయాను.

కానీ త‌ర్వాత మెళ్లిగా అల‌వాటు అయ్యాడంటూ విజ‌య్ చెప్పుకోచ్చాడు. ఇక ఈ చిత్రం అనంత‌రం వీరి ముగ్గురి కాంబినేష‌న్‌లో కాతువాకుల రెండు కాదల్ అంటూ 2022 లో మరో చిత్రం వచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles