రఫ్ఫాడించేందుకు విజయ్‌ రెడీ!

Friday, December 5, 2025

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్’పై అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై బజ్‌ను పెంచాయి. ఇక ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కింగ్‌డమ్ ట్రైలర్ ఇప్పటికే రెడీ అయిపోయిందట. ట్రైలర్‌కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసారని, దాన్ని జూలై 25న విడుదల చేసే అవకాశం ఉందని టాక్. ఇందులో యాక్షన్ సీన్స్, మ్యూజిక్, విజువల్స్‌ ఇలా అన్ని కూడా విజయ్ ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌గా ఉండబోతుందట. ముఖ్యంగా విజయ్ చేసే స్టంట్స్, భాగ్యశ్రీ అందం, స్టైలిష్ టేకింగ్ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.

ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తుండగా, నటుడు సత్యదేవ్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న సంగీతం కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలవనుంది. ఈ మూవీని జూలై 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని యూనిట్ సిద్ధమవుతోంది.

ట్రైలర్‌తో సినిమా హైప్ మ‌రింత పెరిగితే, విజయ్ దేవరకొండ మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles