టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఒక సరైన ట్రీట్ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వాటిలో మెయిన్ గా సినిమా టైటిల్ సహా టీజర్ కట్ కోసం కూడా ఒకటి. అయితే దీనిని ఎప్పుడో విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు కానీ అది ఇంకా రాలేదు. అయితే ఫైనల్ గా దీనికి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా టీజర్ ని ఫిబ్రవరి 7న లాంచ్ చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తోంది.
మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఆల్రెడీ అనిరుద్ సాలిడ్ స్కోర్ ని ఈ టీజర్ కోసం అందించినట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.