టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇపుడు భారీ చిత్రం కింగ్డమ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా షూటింగ్ ఇపుడు అంతిమ దశకు చేరుకోగా అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఈ సినిమా పట్ల ఉన్నర్మ్ ఇక ఇదిలా ఉండగా మన సెన్సేషనల్ హీరో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కనిపించడం వైరల్ గా మారింది.
అయితే నిన్న మార్చ్ 28న జరిగిన వాట్ ఇండియా థింక్స్ టుడే అనే కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా అమిత్ షా అలానే ఇంకొందరు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగింది. ఇలా మోడీతో విజయ్ దేవరకొండ అలానే నటి యామి గౌతమ్ కూడా కనిపించారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.