విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్ మీద సినిమాప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శర వేగంతో అన్ని పనులు పూర్తిచేస్తూ, ప్రమోషన్ల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనిరుద్ కంపోజ్ చేసిన పాట ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా మళ్ళీ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు. కింగ్డమ్ బాయ్స్ మీట్ అంటూ విజయ్, గౌతమ్, అనిరుద్ కలిసి ఉన్న ఈ వీడియోలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ గా విజయ్ తన రౌడీ బ్రాండ్ నుంచి స్పెషల్ డ్రెస్సులు అనిరుద్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. అదే సమయంలో తన మీద హుకుం టీ షర్ట్ కూడా వేసుకొని కనిపించాడు. ఈ వీడియో ఎపిసోడ్ 1 అని చెప్పటంతో, వీరి కలయికలో మరికొన్ని సరదా వీడియోలు రాబోతున్నాయని అర్థమవుతోంది.
ఇలా ఈ ఫన్నీ కంటెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ, అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమా మేకర్స్ ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇస్తూ, మూవీ మీద హైప్ ని దంచి కొడుతున్నారు.
