విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతి వస్తున్నాం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సంక్రాంతి సినిమా థియేటర్స్ లో సెన్సేషనల్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా బుల్లితెరలపై ఎంటర్టైన్ చేసేందుకు వస్తుంది.
ఒక పక్క టీవీ టెలికాస్ట్ కి ఇంకోపక్క జీ5 లో ఓటిటి స్ట్రీమింగ్ కి కూడా ఈ చిత్రం నేడు మార్చ్ 1 సాయంత్రం 6 గంటల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీనితో ఈరోజే సంక్రాంతికి వస్తున్నాం డబుల్ బ్లాస్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కోసం ఆడియెన్స్ వీటిలో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండిట్లో కూడా ఈ చిత్రం ఎలాంటి స్పందన కొల్లగొడుతుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించారు.