బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రం “ఛావా” కోసం యావత్తు భారతదేశం మాట్లాడుతుంది. అయితే ఈ చిత్రం ఛత్రపతి మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించగా భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకుంటుంది.
ఇలా ఇండియా వైడ్ గా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ చిత్రం నిన్న మంగళవారం కూడా సాలిడ్ రన్ ని అందుకుంది. ఇలా డే 5, డే 4 కంటే ఎక్కువగా 25.75 కోట్ల అందుకున్నట్టుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో మొత్తం 5 రోజుల్లో 171.28 కోట్ల నెట్ మార్క్ అందుకుంది. ఇలా ఇండియా వైడ్ గా ఇపుడు 200 కోట్ల మార్క్ కి చేరువ అవుతుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా స్త్రీ 2, ముంజ్యా సినిమాల నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.