తెలుగులోకి ఎప్పుడంటే!

Sunday, March 16, 2025

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఛావా’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపెట్టాడు. ఇక ఈ సినిమా కథ, విక్కీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేస్తున్నారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

అయితే, ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయడంతో మిగతా భాషల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ మార్చి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేసింది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఛావా తెలుగు ట్రైలర్‌ను మార్చి 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని తెలుగు ఆడియన్స్ ఆతృతగా చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles