కొత్త దర్శకుడితో వెంకీ సినిమా!

Wednesday, January 22, 2025

సైంధవ్‌ సినిమా తరువాత ఇప్పటి వరకు నెక్ట్స్ సినిమా ఏంటీ అనేది బయటకు చెప్పలేదు.  కానీ  ఆయ‌న చేతినిండా మాత్రం ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రానా నాయుడు సీజ‌న్ 2’కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ కంప్లీట్‌ చేశారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కబోతుంది.

 ఈ సినిమాలో మ‌రో హీరో కూడా ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈలోగా మ‌రో కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌కూ వెంకీ ఓకే చెప్పార‌ని టాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తుంది. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న’ చిత్రం కోసం రైటింగ్ డిపార్ట్మెంట్ లో ప‌ని చేశారు నందు. ఆయ‌న వెంకీ కోసం ఓ క‌థ సిద్ధం చేసుకోవ‌డం, అది కాస్త వెంకీ వ‌ర‌కూ వెళ్లిందని… ఈ క‌థ వెంకీకి బాగా న‌చ్చింద‌ని, అందుకే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసినట్లు సమాచారం.

వెంకీ స్టైల్ లో స‌ర‌దాగా సాగిపోయే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ సినిమా అని సమాచారం. రావిపూడి సినిమా పూర్త‌యిన వెంట‌నే నందు సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉందని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles