స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్‌లో షికారు చేస్తుంది.
ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ షూటింగ్‌లో వెంకటేష్‌తో పాటు పలువురు కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయని.. వెంకీ తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.
ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది.