తమిళ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు ప్రేక్షకుల మధ్య కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో సూర్య ఒకరు. ఈ మధ్యే ఆయన నటించిన “రెట్రో” అనే చిత్రం ఓటిటిలో రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ అయితే తక్కువ సమయంలోనే సూర్య తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఈసారి ఆయన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో కలవడం విశేషం. ఇద్దరూ కలిసి ఒక ఫ్యామిలీ డ్రామా తీసేందుకు సిద్ధమవుతున్నారు. సూర్య కెరీర్‌లో ఎమోషన్‌కు పెద్ద పీట వేసే సినిమాలే ఎక్కువగా కనిపించగా, ఈ ప్రాజెక్ట్ కూడా అలాంటి ఓ హృదయాన్ని తాకే కథగా ఉండబోతుందనే టాక్ ఉంది.
ఇక ఇటీవల ఈ సినిమా టీమ్ కలిసి తమిళనాడులోని ప్రసిద్ధి గాంచిన పళని మురుగన్ ఆలయానికి వెళ్లిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో సూర్యతో పాటు నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ఉన్నారు. సినిమాలోకి అడుగుపెట్టే ముందు దేవుడి ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర మంచి గుర్తింపు వచ్చేలా చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ వ్యవహరిస్తుండగా, కథానాయికగా మమిత బైజు ఎంపికయ్యారు. షూటింగ్ పూర్తిగా జూన్ 9నుంచి మొదలుకానుంది. ఓవైపు రెట్రోకి మంచి రెస్పాన్స్ వస్తుండగా, మరోవైపు కొత్త సినిమా మీద హైప్ క్రియేట్ కావడం సూర్య అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.
