కొత్త వివాదంలో వీరమల్లు!

Friday, December 5, 2025

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతగా అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఇది ఒక హిస్టారికల్ డ్రామా కావడం, పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ జానర్‌లో నటిస్తున్న విషయాలతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది.

సినిమాలో పవన్ చేయబోయే పాత్ర వీరమల్లు ఒక యోధుడిగా చూపించబోతున్నారు. అయితే ఈ పాత్ర అసలు తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాశారని కొన్ని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్కడా స్పష్టం చేయలేదని, ఆ అంశాన్ని లైట్ తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు.

దీంతో ఆ సంఘాలు నిర్మాతలు ఈ పాత్ర వెనక ఉన్న స్ఫూర్తి ఎవరో క్లారిటీగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏర్పడింది.

ఇక మరోవైపు సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ వివాదం మధ్య రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంటాయో అనేదానిపై కూడా సందేహాలు మొదలయ్యాయి. అయినా కూడా పవన్ అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ హీరో కొత్తగా కనిపించే ఈ యాక్షన్ హిస్టారికల్ సినిమా కోసం గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles