వీర ధీర శూరన్ పార్ట్-2’ వచ్చేస్తోందోచ్‌!

Tuesday, January 21, 2025

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ రూపుదిద్దకుంటుంది. ఈ చిత్రానికి ఎస్‌యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, విక్రమ్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా శిబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

రెండు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆయన నుండి సాలిడ్ పవర్‌ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని ఈ టీజర్‌లో చూపించారు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్‌జే సూర్య మరోసారి తన సత్తా చూపించనున్నారు. ఈ సినిమాలో విక్రమ్, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని టీజర్ చూస్తే తెలిసిపోతుంది.

ఇక ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్నప్పటికీ కూడా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరిలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles