వరుణ్‌ తేజ్‌ మట్కా షూటింగ్‌ వైరల్‌!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆపరేషన్‌ వాలెంటైన్‌ అనే సినిమాతో వరుణ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం “మట్కా”..ఈ సినిమాను “పలాస 1978 ” ఫేమ్ కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంకా పూర్తి కావడం లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ  వైరల్ అవుతుంది. ‘మట్కా’ మూవీ తరువాత షెడ్యూల్ షూటింగ్ జూన్ 12 నుంచి మొదలు కానుంది అని సమాచారం.

ఈ కొత్త షెడ్యూల్ ఏకంగా 40 రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ వైజాగ్ ను ప్రేక్షకులకు చూపించేందుకు అద్భుతమైన సెట్ వేశారు. ఈ షెడ్యూల్ లోనే సినిమా ముఖ్యమైన  పార్ట్‌ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నవీన్ చంద్ర ,నోరా ఫతేహి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles