అలసి పోయిన ఊపిరి అంటున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌!

Wednesday, January 22, 2025

స్టార్‌ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. తండ్రికి మించిన పేరు సంపాదించుకుంది. భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం హనుమాన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో అమ్మడు క్రేజ్‌ కూడా అలాగే పెరిగింది.

ప్రస్తుతం వరలక్ష్మి ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఒక లెక్క, తాజాగా విడుదలైన సాంగ్ ఒక లెక్క అన్నట్లు ఉంది. సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి టాక్‌ ను అందుకుంది.

 తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.. అలిసిన ఊపిరికి ఖనఖన మండే గుండె ఆయుధంగా మారే అంటూ సాగే లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ సాంగ్ ను రెహమాన్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు..ఈ సినిమాను మే 3 న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటివరకు ముఖ్య పాత్రల్లో  మాత్రమే నటిస్తూ వచ్చింది.  ఈ సినిమాలో మాత్రం లీడ్ రోల్ లో నటిస్తుంది. అదే జోష్ లో ఇప్పుడు ఈ సినిమా లో చేస్తుంది. శబరి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles