ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీరోగా పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో తన సెన్సేషనల్ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండడంతో హిస్టరీ కూడా రిపీట్ అవుతుంది అని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా పవన్ ఇచ్చిన కొన్ని డేట్స్ లోనే ఒక ఊహించని అవుట్ పుట్ ని ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసాడు హరీష్.
అయితే తాజాగా ఈ సినిమా నిలిచిపోయింది అంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో వాటికి చెక్ పెట్టేందుకు స్వయంగా డైరెక్టర్ హరీశ్ శంకరే రంగంలోకి దిగారు. “సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు …..” అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆయన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.