సూర్య సినిమాలో ఊర్వశి!

Thursday, March 27, 2025

తమిళ స్టార్‌ హీరో సూర్య – వెంకీ అట్లూరి కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెల నుంచి వెంకీ అట్లూరి సినిమాకు సూర్య డేట్స్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ మొదట భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారనే టాక్ నడిచింది. ప్రస్తుతం ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఓ కీలక పాత్రలో యాక్ట్‌ చేస్తుందంట.

బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశి రౌతేలా మంచి పాత్ర పోషించింది. ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే హైలైట్ అయింది. ‘సితార’ బ్యానర్ లోనే ‘డాకు మహారాజ్’ వచ్చింది. ఇప్పుడు ఇదే బ్యానర్ లో రాబోతున్న సూర్య సినిమాలో కూడా ఊర్వశి రౌతేలాకి మరో బంపర్ ఆఫర్ తగిలిందని తెలుస్తుంది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles