టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా గురించి ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తుండగా, హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్సే నటిస్తోంది. రామ్ ఇందులో తనకు ఇష్టమైన హీరోకి పెద్ద అభిమాని పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ హీరోగా రియల్ స్టార్ ఉపేంద్రను పరిచయం చేస్తున్నారు.
ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయన లుక్‌ను ప్రత్యేక పోస్టర్ రూపంలో రిలీజ్ చేసింది. వింటేజ్ టచ్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో ఉపేంద్రని కొత్త స్టైల్‌లో చూపించారు. దీనితో ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందో కొంతవరకు స్పష్టమైంది. ఉపేంద్ర రోల్‌లో భావోద్వేగాలు, ఆసక్తికరమైన షేడ్స్ రెండూ ఉంటాయని సమాచారం.
