కంగనా ఎమెర్జెన్సీ పై కేంద్ర మంత్రి ప్రశంసలు!

Monday, January 13, 2025

కంగనా ఎమెర్జెన్సీ పై కేంద్ర మంత్రి ప్రశంసలు! బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, వివాదాలకు పెట్టింది పేరు అయిన ‘కంగనా రనౌత్’ స్వయంగా డైరెక్షన్‌ చేసిన సినిమా ఎమర్జెన్సీ. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు రెడీ అయ్యింది.ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఈ మూవీ ప్రీమియర్‌ను సినిమా టీమ్ నాగ్‌పూర్‌లో ప్రదర్శించింది.

కంగనా, అనుపమ్ ఖేర్‌కు ఈ సందర్భంగా గడ్కరీ కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశ చరిత్రలోని ఓ చీకటి అధ్యాయాన్ని చాలా బాగా తెరకెక్కించారని పొగిడారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా కోరారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా నే స్వయంగా కనిపించబోతుంది.

అలాగే, మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బీజీపీ పార్టీ నుంచి కంగ‌నా ఎంపీగా గెలిచింది. ఈ క్రమంలో ఆమె ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా సినిమా చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఒకవేళ సినిమాలో ఇందిరా గాంధీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉంటే తగిన బుద్ధి చెబుతాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్ట్ లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles