పాపం..దాస్‌..దెబ్బకి అడ్రస్‌ మార్చేశాడుగా!

Thursday, December 26, 2024

టాలీవుడ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కి గత కొంతకాలంగా బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్నట్లుంది.  ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యూత్లో మంచి క్రేజ్ అందుకున్న విశ్వక్‌.. ఆ తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాని హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్నింటితో హిట్ అందుకుంటే…కొన్నిటితో చిక్కుల్లో పడ్డాడు. అయినా సరే ఏ మాత్రం వెను తిరగకుండా టాలీవుడ్ లో దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా విశ్వక్‌ కి ఊహించని ఇబ్బందులు ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఆ దెబ్బతో ఆయన ఏకంగా ఇంటి అడ్రస్ కూడా మార్చేసినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే గత 45 రోజుల నుంచి విశ్వక్‌ ఎక్కువగా మీడియాకి కనిపిస్తూ వస్తున్నాడు.. ఆయన సొంత సినిమా ఈవెంట్లతో పాటు పలువురు చిన్న హీరోల సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు అలాగే ఇతర ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడు.

దీంతో ఆడియన్స్ లో విశ్వక్సేన్ ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాడా? ప్రతి హీరో ఈవెంట్ కి ఈయనే కనిపిస్తున్నాడు ఏంటి అనే చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం ఆయన ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పూర్తి చేసుకుని వెళుతుండగా అదే వేదిక మీద లాంచ్ చేయాల్సిన మరో సినిమా బృందం ఆయనకు ఎదురుపడింది. ఆ సమయంలో తమ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేయాల్సిందిగా కోరితే నేను వేరే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చాను ఇక్కడ అలా చేస్తే బాగుండదు అని వెనక్కి పంపించబోయాడట.

ఈ సంఘటనను ఎవరో రికార్డ్ చేసి ఉంటారు విశ్వక్ ను ట్రైలర్ లాంచ్ చేయమంటే చేయను అని వెనక్కి పంపాడు అనేలా వీడియోలు వైరల్ చేస్తారు…. అని ట్రైలర్ చూసి లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి వెనక్కి వచ్చాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఆబ్లిగేషన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అని భావించి ఫిలింనగర్ నివాసంలో కాకుండా తాను కొనుగోలు చేసిన గచ్చిబౌలి ఫ్లాట్ కి షిఫ్ట్ అయినట్లు సమాచారం.

ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటే అన్ని సినిమా ఈవెంట్లకు ఆహ్వానాలు అందుతున్నాయని అన్నిటికీ వెళ్లాలంటే ఇబ్బందే అని భావించి ఆయన ఇల్లు మారినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles