అసలు ఊహించలేదుగా!

Monday, January 27, 2025

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సలార్ 2 సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో ఎవరికీ క్లారిటీ లేకుండా ఉంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా తరువాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం కూడా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 20 రోజులు షెడ్యూల్ పూర్తయిందని ఆ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు అని సమాచారం.

సినిమా మొదటి భాగంలో ఏర్పరిచిన ఆసక్తి కారణంగా సలార్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఆగస్టు 10 నుంచి రామోజీ ఫిలిం సిటీలో 15 రోజుల సలార్ 2 షెడ్యూల్ జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆ షెడ్యూల్ పూర్తికాలేదు.  ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ లో సలార్ 2 కోసం వేసిన సెట్ అలాగే ఉందని సమాచారం.

అయితే తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం సలార్ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే 20 రోజులు జరిగింది. కాబట్టి ఈ సినిమాకి ఎలాంటి అడ్డంకి లేదు. అయితే నీల్‌ యంగ్‌ టైగర్‌ తో ఓ సినిమా ఒప్పుకున్నాడు. కాబట్టి ముందు ప్రభాస్‌ సినిమా చేస్తాడా లేక  ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? లేదా రెండు ఒకేసారి చేస్తాడా? అనే విషయం మీద క్లారిటీ లేదు.

ఇక ఖాన్సార్ అనే ఒక ఊహజనిత రాష్ట్రం గురించి సలార్ సినిమాలో చూపించారు. ఆ రాష్ట్ర ఆధిపత్యం ఎవరికి దక్కుతుంది అనే కాన్సెప్ట్ తో సలార్ మొదటి భాగం సాగింది. రెండో భాగానికి ఎన్నో అనుమానాలు రేకెత్తించగా ఈ రెండవ భాగం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles