పాన్ ఇండియా విజేతలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీల్లో “వార్ 2” ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లకు వచ్చే సమయం దగ్గర పడింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వచ్చే సినిమాలు అన్నీ భారీ యాక్షన్ సన్నివేశాలతోనే మెప్పించాయి. అదే తరహాలో “వార్ 2” కూడా పూర్తిగా యాక్షన్ ప్యాకేజీగా సిద్ధమైందని సమాచారం. మొత్తం ఆరు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు జాగ్రత్తగా డిజైన్ చేశారు. అదేకాక, క్లైమాక్స్‌లో ప్రత్యేక సర్ప్రైజ్ సన్నివేశాన్ని కూడా చేర్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, సినిమాకి పోస్ట్ క్రెడిట్ సీన్స్‌గా రెండు సీన్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద, “వార్ 2” ప్రేక్షకులకు థ్రిల్లింగ్ యాక్షన్‌తో పాటు అదనపు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేలా తయారైంది.
