అసలే భారతీయుడు 2 పరాజయంతో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇక ఇప్పుడు డైరెక్ట్‌గా శంకర్ సినిమా ఓటిటిలోకి రాబోతుందనే న్యూస్ మరింత ఆందోళనకు గురి చేస్తుంది.. అసలు శంకర్ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రావడమేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
భారతీయుడు 2 మధ్యలో ఆగిపోవడంతో రామ్ చరణ్‌తో సినిమా మొదలు పెట్టాడు శంకర్. కానీ కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా హిట్ అవడంతో వెంటనే ఇండియన్ 2ని లైన్ లో పెట్టాడు. దీని కారణంగా గేమ్ ఛేంజర్ ఆలస్యం అవ్వడం మొదలైంది. ఫైనల్‌గా భారతీయుడు 2 రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు భారతీయుడు 3 మాత్రం థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే పార్ట్ 2తో పాటు పార్ట్ 3 షూటింగ్ కూడా చేశాడు శంకర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే.. భారతీయుడు 2 హిట్ అయితే కనుక వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకుని వద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు కంటెంట్ మీద నమ్మకం పోవడంతో.. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే సేఫ్ అవ్వొచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఎందుకంటే.. ‘భారతీయుడు 3’ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు మరీ. 300 కోట్లు వస్తే గానీ ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
ఇప్పటికే భారతీయుడు 2 భారీ నష్టాలను మిగిల్చింది. అందుకే.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోందట. అయితే.. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తర్వాతే.. ‘భారతీయుడు 3’ ఓటిటిలోనా? లేక థియేటర్లోనా? అనే డెసిషన్ తీసుకోనున్నారు మూవీ మేకర్స్. కానీ మెజారిటీ ఛాన్స్ మాత్రం ఓటిటికే ఉందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.