దేవర సినిమా ఉంచి ఊహించని లీక్‌!

Tuesday, January 28, 2025

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా మాస్‌ యాక్షన్‌ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా మోస్ట్ అవైటెడ్‌ మూవీ దేవర. ఈ సినిమా గురించి అటు తారక్‌ అభిమానులు, ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు పూర్తి కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన పలు లీక్ లు అయితే సోషల్ మీడియాలో బయటకి వచ్చి వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఒక ఊహించని లీక్ వైరల్ అవుతున్నట్టుగా సమాచారం.

ఈ సినిమాలో ఆయుధ పూజ అనే పవర్ఫుల్ సాంగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీని నుంచి ఒక 20 సెకండ్స్ బిట్ లీక్ అయ్యినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టాక్ నడుస్తుంది. దీనికి అనిరుద్ అందించిన సంగీతం అదిరిపోయిందని చెప్పుకొవచ్చు అంటూ వారు మాట్లాడుకుంటున్నారు.

ఆల్రెడీ దేవర నుంచి తరువాత వచ్చే సాంగ్ ఇదే అని ఇప్పుడు ఓ టాక్‌ నడుస్తుంది. అయితే ఈ సాంగ్ ఇప్పుడే  లీక్ అవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles