ఉగాది స్పెషల్ సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే పోస్టర్‌!

Sunday, December 22, 2024

నాచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా , వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌ లో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం సరిపోదా శనివారం . వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది.  ఈ సినిమాని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ మూవీలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ యాక్ట్‌ చేస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 29 న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నారు. సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే ఫ‌స్ట్ లుక్, పోస్టర్, స్పెషల్ గ్లింప్స్, టీజర్‌ను విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

కాగా  ఉగాది సందర్భంగా  మూవీ టీమ్‌ సరికొత్త పోస్టర్ విడుదల చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్‌ లో సాయి కుమార్, నాని ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో మనం ఒక వేడుక వాతావరణాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

సరిపోదా శనివారం భిన్నమైన కథాంశంతో రూపొందనున్న చిత్రం. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే కోపంగా కనిపించే హీరో కథగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.  యాక్షన్‌, వినోదానికి పెద్దపీట వేసినట్లు సమాచారం.  ఈ సినిమాలో తమిళ డైరెక్టర్ ఎస్‌జె సూర్య విలన్‌ గా కనిపించనుండగా.. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. దసరా, హాయ్ నాని వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నాని.. సరిపోదా శనివారంతో మరో హిట్‌ కొట్టి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles