మరో రెండు సినిమాలు

Thursday, December 26, 2024

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా ‘మెకానిక్ రాకీ’  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి డీసెంట్ టాక్ లభిస్తుండటంతో ఈ మూవీ వీకెండ్‌పై పూర్తి గా కన్నేసింది. ఇక ఈ సినిమాలో విశ్వక్  నటనకి మంచి మార్కులే వచ్చాయి. అయితే, ఈ సినిమా విడుదల వేళ, ఇప్పుడు విశ్వక్ తన తరువాత సినిమాకి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

విశ్వక్ సేన్ ఇప్పటికే ‘లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సందడి చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులకు ఆయనగ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో ఓ సినిమా కూడా ఉంటుందని సమాచారం.

పూర్తి ఎంటర్‌టైనింగ్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర అల్టిమేట్‌గా నవ్విస్తుందని.. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని టాక్‌ వినపడుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles