నాని సరసన ఇద్దరు హీరోయిన్లు!

Saturday, January 18, 2025

2023లో హీరో నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఉంది. దసరా చిత్రం డబ్బులతో పాటు సైమా, ఐఫా అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో నాని, శ్రీకాంత్‌ కాంబోలో మరో సినిమా రూపొందుతోంది. దసరా 2024 సందర్భంగా ‘నాని ఓదెల 2’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం ప్రారంభం అయ్యింది.

సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్‌ కథని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల రెడీ చేశారని సమాచారం. దసరా సినిమాతో పోలిస్తే.. వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ ఇదని తెలుస్తుంది. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి.

తాజాగా మరో బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ పేరు వినపడుతుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కాబట్టి.. ఆ రేంజ్ కథానాయిక కోసం చూస్తున్నారని తెలుస్తుంది. జాన్వీ కపూర్‌ లేదా శ్రద్ధా కపూర్‌లలో ఒకరు నాని సరసన నటించే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ తెలుగులో ఇప్పటికే ‘దేవర’ సినిమాలో నటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles