రెండు శుభవార్తలు..ఓ చెడు వార్త..వెయింటింగ్‌!

Wednesday, January 22, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, కియారా అద్వానీ అలాగే అంజలీ హీరోయిన్స్ గా కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ని ఇస్తున్న తరుణంలో ఈ దసరా కానుకగా అయితే టీజర్ ని ఆల్రెడీ ఫిక్స్‌ చేశారు.

కానీ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే “గేమ్ ఛేంజర్” టీజర్ ఇప్పుడు రావడం లేదని సంగీత దర్శకుడు థమన్ పేర్కొన్నాడు. టీజర్ దసరా కి రావట్లేదని డిజప్పాయింట్ కాకండి టీజర్ కి ఇంకా సీజీ వర్క్స్ డబ్బింగ్, ఫైనల్ ఎడిటింగ్ ఇంకా జరుగుతున్నాయి.  అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్లు తెలియజేశాడు.

దీంతో చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒకింత బాగా డిజప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పెద్ద సినిమాల్లో ఇంకా ఎలాంటి టీజర్ లేకుండా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్ ఒక్కటే అని తెలుస్తుంది. అందుకే వారు నిరాశలో ఉన్నారు కానీ థమన్ మరో రెండు గుడ్ న్యూస్ లు కూడా దీంతో అందించాడు. సినిమాలో 3వ సాంగ్ ని మొదటిగా నవంబర్ లో విడుదల చేస్తున్నట్లుగా థమన్ చెప్పుకొచ్చాడు.

కానీ ఇప్పుడు దీనిని ఈ అక్టోబర్ 30నే విడుదల చేస్తున్నట్టు తేదీలను ప్రకటించేశాడు. ఇక దీంతో పాటుగా గేమ్ చేంజర్ సంక్రాంతికి రావడం లేదని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.  తాను మళ్ళీ డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ రాబోతున్నట్టుగా చెప్పుకొచ్చాడు. సో ఇలా రెండు గుడ్ న్యూస్ లు ఓ బ్యాడ్ న్యూస్ అయితే మెగా అభిమానులకి వచ్చిందని చెప్పుకొవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles