ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ… హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. కాగా కొంతకాలం క్రితం మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అయితే అనారోగ్య సమస్యలతో గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు సినిమాల, సిరీస్‌ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది.
ఇదిలా ఉంటే సమంత నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ ఉంది..ఈ క్రమంలోనే సమంత ఇతరులు హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలియజేస్తూ బాత్ టబ్ థెరపీ గురించి వివరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే వాటిని కంటిన్యూ చేస్తునే తాజాగా సామ్ తన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో సామ్ నడుమును ఓ తీగలాగా ఎలాపడితే అలా తిప్పుతూ తాను కూడా మెలికలు తిరుగుతూ వ్యాయామం చేసింది. అదేవిధంగా నాకు ఇష్టమైన వర్కౌట్స్‌లో ఫ్లోర్ మూమెంట్ ఒకటి. ఇది చేస్తూ వేరే వాళ్ళకి నేర్పిచండం అంటే ఇంకా ఇష్టం అంటూ ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ఆ ఆసనాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. అదే విధంగా సినిమా ఆఫర్లు లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి ఆసనాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుందని మరికొంత మంది అంటున్నారు.