పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల పరంగా పూర్తిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు తన రాజకీయ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నా కూడా, మరోవైపు సినిమాల మీద ఫోకస్ తగ్గించకుండా ప్రాజెక్ట్స్‌ని బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ మూవీ థియేటర్లలోకి వచ్చే తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఓజి సినిమా కూడా చివరి దశకు చేరుకుంటోంది.
ఇలాంటి టైంలో పవన్ మరో సినిమా అయిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పాల్గొంటూ, నటనకు మరోసారి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈ తాలూకు వేగం చూస్తే, పవన్ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఒక అరుదైన రికార్డును తిరిగి అందుకున్నట్టు స్పష్టమవుతుంది.
పవన్ కెరీర్‌లో ఒకే సంవత్సరం రెండు సినిమాలు విడుదల కావడం చాలా సార్లు జరగలేదు. గతంలో 2006లో ‘బంగారం’ తర్వాత ‘అన్నవరం’ అనే సినిమాలు కేవలం కొన్ని నెలల గ్యాప్‌లో విడుదలయ్యాయి. అప్పటి తర్వాత అలాంటి సందర్భం మళ్లీ రాలేదు. అయితే ఇప్పుడు అదే ఫీట్ మళ్లీ రిపీట్ అవుతోంది.
2025లో హరిహర వీరమల్లు, ఓజి అనే రెండు ప్రాజెక్టులు కూడా మూడు నెలల వ్యత్యాసంలో విడుదలకు సిద్ధంగా ఉండటం విశేషం. తేదీల్లో కాస్త మార్పులు వచ్చినా, రెండూ ఈ ఏడాదిలో థియేటర్లలోకి రానున్నాయన్న విషయం మాత్రం స్పష్టంగా కనబడుతోంది.
ఇలా ఇన్నేళ్ల తర్వాత పవన్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులకు స్పెషల్ ఫీలింగ్‌ని కలిగిస్తోంది. ఈ రెయిర్ మోమెంట్ మళ్లీ చూడడానికి అవకాశం వచ్చినందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
