మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను తెలుగులోనూ మేకర్స్ విడుదల చేశారు.
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తెలుగులో మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, కలెక్షన్స్ మాత్రం నిరాశ పరిచాయి. ఈ సినిమా మలయాళంలో ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు చేసి రికార్డులు క్రియేట్ చేసింది.
కానీ, తెలుగులో మాత్రం ఈ సినిమా కనీస రెస్పాన్స్‌ను అందుకోలేకపోయింది. ఈ సినిమాలో శోభన ఫీమేల్ లీడ్‌గా నటించింది.
