స్టార్ హీరోయిన్ త్రిష ఈ మధ్యకాలంలో తన కెరీర్‌లో సినిమాలు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటోంది. ఆమె చేసిన ప్రతి సినిమా థియేటర్ల దగ్గర మంచి ఫలితాలు సాధించడం గమనార్హం. సినిమాలకే పరిమితం కాకుండా డిజిటల్ స్పేస్‌లో కూడా తన టాలెంట్ చూపించడానికి త్రిష ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆమె చేసిన మొదటి వెబ్ సిరీస్ ‘బృందా’ 2024లో సోని లివ్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కథలో ఉన్న టర్న్‌లు, సస్పెన్స్ సీన్లు ఆడియన్స్‌ని కట్టిపడేశాయి. ఈ సిరీస్‌కి వచ్చిన స్పందనను చూసి మేకర్స్ వెంటనే రెండో సీజన్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సీజన్ 2 షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.
త్రిష మరోసారి తన నటనతో అభిమానులను అలరించబోతోందని టీమ్ చెబుతోంది. సూర్య మనోజ్ వంగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీజన్‌లో రవీంద్ర విజయ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
