ప్రస్తుతం సౌత్ సినిమా నుంచి భారీ హైప్ లో పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర అలాగే మళయాళ సహా తమిళ్ నుంచి మరింత మంది స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఉన్నారు అని ఆల్రెడీ టాక్ ఉంది.
కానీ తనని మాత్రం మేకర్స్ సస్పెన్స్ గానే ఉంచుతున్నారని చెప్పాలి. సినిమాకి సంబంధించి వదులుతున్న ప్రమోషనల్ కంటెంట్ లో తన విజువల్స్ చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే మొన్న లోకేష్ కనగరాజ్ తో డిస్కషన్ లో ఉన్నట్టు ఓ పిక్ బయటకి వచ్చింది కానీ అది కూలీ సెట్స్ నుంచే అని చెప్పడానికి లేకుండా పోస్ట్ చేశారు. ఇలా ఈ స్టార్ హీరో విషయంలో మాత్రం మేకర్స్ అమీర్ ప్రెజెన్స్ ఉన్నట్టే చూపించడం లేదు. మరి తాను ఉన్నారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే కొనసాగుతుంది.